ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, పర్యటక శాఖ సంయుక్తంగా ఒక సమావేశాన్ని విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. విశాఖ సీతమ్మధారలోని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాసంలో... పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటి అయ్యారు. ఏపీ ఫైబర్ నెట్ మరింత బలోపేతం చేస్తామని.. అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం తీసుకొస్తామని అన్నారు. అందుకు సుమారు ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఐటీ రంగాన్ని ఏపీలో మరింత బలోపేతం చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. మెడ్ టెక్ జోన్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యవస్థ అని.. దీనివల్ల ఇప్పుడు అనేక ఉత్పత్తులు మనకు తక్కువ ధరకు లభిస్తున్నాయని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, పర్యటక శాఖ సంయుక్త సమావేశం - మెడ్ టెక్ జోన్ తాజా వార్తలు
ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, పర్యటక శాఖ సంయుక్తంగా ఒక సమావేశం జరగనుంది. విశాఖలో పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భేటి అయ్యారు
ఫిబ్రవరిలో పరిశ్రమల శాఖ, పర్యటక శాఖ సంయుక్త సమావేశం