Minister Karumuri Nageswara Rao on kcr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాత వచ్చినా.. ఏపీలో వైకాపాకు ఏం ఇబ్బంది ఉండదని మంత్రి కారుమూరి కేసీఆర్... బీఆర్ఎస్ పార్టీ పెట్టడం వల్ల తమకు నష్టం లేదని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తాత వచ్చినా.. వైకాపాకు ఏ ఇబ్బంది ఉండదు:మంత్రి కారుమూరి - ఏపీ తాజా వార్తలు
Minister Karumuri Nageswara Rao: కేసీఆర్ తాత వచ్చినా.. ఏపీలో వైకాపాకు ఏం ఇబ్బంది ఉండదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అమరావతి రైతు యాత్ర పూర్తిగా... తెదేపా నేతల యాత్ర అని ఆరోపించారు. అమరావతి రైతు యాత్రలో బెంజ్ కార్లు, బంగారు రిస్ట్వాచ్లు ఉన్నవాళ్లు యాత్ర చేస్తున్నారని అన్నారు.
![కేసీఆర్ తాత వచ్చినా.. వైకాపాకు ఏ ఇబ్బంది ఉండదు:మంత్రి కారుమూరి Minister Karumuri Nageswara Rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16580707-456-16580707-1665147289170.jpg)
మంత్రి కారుమూరి
చంద్రబాబు అనేక ప్రదేశాలు రాజధాని అని చెప్పి వారి అనుచరులు ఉన్న ప్రదేశంలో అమరావతి రాజధానిగా హడావిడి చేశారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో ఆరు జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి రైతు యాత్ర పూర్తిగా.. తెదేపా నేతల యాత్ర అని ఆరోపించారు. అమరావతి రైతు యాత్రలో బెంజ్ కార్లు, బంగారు రిస్ట్వాచ్లు ఉన్నవాళ్లు యాత్ర చేస్తున్నారని అన్నారు.
కేసీఆర్ పార్టీపై కారుమూరి కీలక వ్యాఖ్యలు
ఇవీ చదవండి: