విశాఖ జిల్లాలో కొవిడ్ నివారణ చర్యలు, ఆసుపత్రుల్లో సదుపాయాలు, కొవిడ్ కేర్ కేంద్రాల సేవలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు హాజరై వ్యాక్సినేషన్, అంబులెన్స్‌ల లభ్యత, కొవిడ్ చికిత్స, కొవిడ్ కేర్ కేంద్రాల నిర్వహణ వంటి అంశాలను వివరించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కొవిడ్ కట్టడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.
కొవిడ్ నివారణ చర్యలపై మంత్రి కన్నబాబు సమీక్ష - minister kannababu latest review meetings
కొవిడ్ నివారణ చర్యలు, ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలపై మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.
minister kannababu review