భారీ వర్షాల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై అధికారులతో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. నగర పరిధిలో వర్షాల కారణంగా గోడ కూలి ఇద్దరు చనిపోయారని, గాయపడిన మరో ఇద్దరికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 18ఏళ్ల యువకుడు వరాహా నదిలో గల్లంతయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని మంత్రి చెప్పారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారని మంత్రి పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురైన ప్రాంతాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉన్నామని, అవసరమైతే సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను తరలించాలని ఆదేశించామన్నారు.
పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు: మంత్రి కన్నబాబు - విశాఖలో భారీ వర్షాలు
విశాఖలో ముంపుకు గురైన ప్రాంతాల్లో అధికారుల సహాయ చర్యలు చేపట్టాలని మంత్రి కన్న బాబు ఆదేశించారు. ముంపునకు గురైన పంటలకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
![పంట నష్టం అంచనాలకు ప్రత్యేక బృందాలు: మంత్రి కన్నబాబు Minister kanna babu on rains at vishaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9154717-601-9154717-1602554029632.jpg)
ముంపు ప్రాంతాలపై మంత్రి కన్నబాబు
పంటలకు జరిగిన నష్టాలపై వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పడి అంచనా వేస్తున్నాయని చెప్పారు. ఇళ్లకు జరిగిన నష్టాలపై ఆరా తీస్తున్నామని, బాధితులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'న్యాయమూర్తులపై వ్యాఖ్యల కేసులో కుట్రకోణం ఉంటే తేల్చండి'