Air Travel Association: విశాఖ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ నిర్వహించిన ఎయిర్ కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధి సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. విశాఖ పర్యటకంగా అభివృద్ధి అవుతుందని ఆయన అన్నారు. కొవిడ్ పరిస్థితులు వల్ల రెండేళ్ల పాటు పర్యాటక రంగం ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి త్వరలో శ్రీలంక, మలేషియాకి నూతన సర్వీస్లు మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. జులైలో విశాఖ నుంచి భువనేశ్వర్, గోవాకు కొత్త సర్వీసులు ప్రారంభమవుతున్నాయన్నారు. విశాఖ నుంచి అంతర్జాతీయంగా మరిన్ని సర్వీసులు పెరుగుతున్నాయన్నారు. దావుస్ పర్యటనతో రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని తెలిపారు. 18 అంశాలపై దావుస్ సదస్సు జరుగుతోందని, 10 అంశాల్లో ఏపీ పాల్గొంటున్నట్లు చెప్పారు.
విశాఖ నుంచి త్వరలో శ్రీలంక, మలేషియాకి నూతన సర్వీస్లు- గుడివాడ అమర్నాథ్ - విశాఖ జిల్లా తాజా వార్తలు
Air Travel Association: విశాఖ ఎయిర్ ట్రావెల్ అసోసియేషన్ నిర్వహించిన ఎయిర్ కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధి సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి త్వరలో శ్రీలంక, మలేషియాకి నూతన సర్వీస్లు ప్రారంభమవుతున్నాయన్నారు.
విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి త్వరలో శ్రీలంక, మలేషియాకి నూతన సర్వీస్లు