Minister Gudivada Amarnath:వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడున్నర సంవత్సరాలుగా.. టీడీపీని, చంద్రబాబును జనం విశ్వసించడం లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబు అనేక విమర్శలు చేస్తున్నారని,.. తెలంగాణలో వాటిని చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి ఎద్దేవా చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజాంలో పర్యటిస్తూ, ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలన్నారు. 1995లో ముఖ్యమంత్రి అయి ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖ పరిపాలన రాజధానిగా.. వ్యతిరేకించినందున ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
ఉత్తరాంధ్ర కోసం చంద్రబాబు చేసిందేమిటీ ?: మంత్రి గుడివాడ అమర్నాథ్ - చంద్రబాబాపై గుడివాడ అమర్నాథ్ విమర్శలు
Gudivada Amarnath: ఉత్తరాంధ్రకు వచ్చి చంద్రబాబు అనేక విమర్శలు చేస్తున్నారని, తెలంగాణలో వాటిని చూపించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల కోసం బాబు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వల్లే విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్లు మంత్రి తెలిపారు.
గుడివాడ అమర్నాథ్
జనవరి నుంచి ఏప్రిల్ వరకూ అంతర్జాతీయ సదస్సులు విశాఖలో జరగనున్నాయని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ను ఈ స్థాయికి తెచ్చిన ఘనత జగన్ మోహన్రెడ్డిదేనన్నారు.
ఇవీ చదవండి: