రాష్ట్రంలో టిడ్కో ఇళ్లు పూర్తిస్ధాయిలో లబ్దిదార్లకు చేరకపోవడానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కారణమని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. న్యాయస్ధానాల్లో ఉన్నందునే ఇప్పుడు వాటిని లబ్దిదార్లకు ఇచ్చేందుకు అవకాశం లేకుండాపోయిందన్నారు.
టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు చేరకపోవడానికి గత ప్రభుత్వమే కారణం: బొత్స - విశాఖ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్
లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు అందకపోవడానికి గత ప్రభుత్వమే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ అలోచన నుంచి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ, వలంటీర్ల వ్యవస్ధలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయన్నారు.

minister botsa
విశాఖలోని జీవీఎంసీ పరిధిలో సచివాలయాల పనితీరును ఆయన పరిశీలించారు. ప్రజలకు సేవలందించడంలో సచివాలయంలో ఉన్న ఉద్యోగులంతా అంకితభావంతో పని చేయడం ద్వారా తమ సమర్ధతను నిరూపించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ అలోచన నుంచి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ, వలంటీర్ల వ్యవస్ధలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని మంత్రి బొత్స తెలిపారు. బొత్స పర్యటనలో జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు.