ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భూరికార్డులు మార్చిన విషయం చెప్పలేదెందుకు?' - మంత్రి బొత్స సత్యనారాయణ న్యూస్

హుద్‌హుద్‌ తుపాను తరువాత విశాఖలోనే కూర్చొని అన్నీ చేశానని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన కొన్ని విషయాలకు సమాధానమివ్వాలని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

records
records

By

Published : Mar 8, 2021, 12:16 PM IST

‘చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.. ఆనందపురం, భీమిలి, పరవాడ, పెందుర్తి తహసీల్దారు కార్యాలయాల్లో భూముల రికార్డులు తారుమారయ్యాయి. విశాఖలోని భూ యజమానుల ఇళ్లలో అసలు పత్రాలుంటే ఆ ఆఫీసుల్లో మాత్రం పేర్లు, ఊర్లు మారిపోయాయి. ఇది వాస్తవం కాదా..? హుద్‌హుద్‌ తుపాను సముద్రపు ఒడ్డున వస్తే.. అక్కడ ఆ కార్యక్రమాలు జరగడానికి కారణాలేంటి? దానికి చంద్రబాబు, ఆయన కుమారుడు, విశాఖలోని స్థానిక పెద్దలు కారణం కాదా?’ - మంత్రి బొత్స సత్యనారాయణ

లూలూ సంస్థ గురించి మాట్లాడుతూ.. ‘విశాఖ బీచ్‌ రోడ్డులోని 32 ఎకరాల్ని లూలూ సంస్థకు ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టడానికని గత ప్రభుత్వం ఇచ్చింది. అలా చేస్తే విశాఖ ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది? వారొక (లూలూ) డెవలపర్‌. వాళ్లని తలదన్నేవారు వందలమంది ఉన్నారని వెల్లడించారు. విశాఖకే తలమానికంగా ఉండేలా కార్యాచరణ రూపొందించామని, 20 రోజల కిందటే ముఖ్యమంత్రితో చర్చించాక గ్లోబల్‌ టెండర్లకు వెళ్లమన్నారని తెలిపారు. విశాఖలో అసలైన అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో జరిగిందని చెబుతూ.. ఎస్‌ఈజెడ్‌, ఫార్మా లాంటిచోట్ల శిలాఫలాకాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. విశాఖలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, శుద్ధిప్లాంటకు రూ.900 కోట్లతో ప్రాజెక్టు తెచ్చారని, ఇందులో రూ. 450 కోట్లు అప్పు, మరో రూ.80 కోట్లు బాండ్ల మీద తెచ్చారన్నారు. అప్పట్లో జీవీఎంసీ భవనాలు తాకట్టు పెట్టారని తెదేపాపై విమర్శలు చేశారు. దాన్ని రీషెడ్యూలు చేసి స్మార్ట్‌సిటీ నిధులతో జీవీఎంసీకి భారం తగ్గించామన్నారు.

ఇదీ చదవండి:రాజధాని గ్రామాల్లో ఉద్రిక్తత...

ABOUT THE AUTHOR

...view details