పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీరుతామని.. లేని పక్షంలో రాష్ట్రమే ఆ బాధ్యతను భరిస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అవసరమైతే కేంద్రానికి పోలవరం నిర్మాణం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రభుత్వం ధ్యేయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లలో పోలవరం కోసం ఖర్చు చేసింది 265 కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచి పోలవరంపై ప్రత్యక శ్రద్ధతో పని చేస్తున్నామని తెలిపారు.
పోలవరానికి కేంద్రం నిధులివ్వకుంటే బాధ్యత మేమే తీసుకుంటాం: మంత్రి బొత్స - విశాఖ జిల్లా తాజా వార్తలు
పోలవరంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని పోలవరం విషయంలో ఎలాగైనా ఒప్పిస్తామని..లేందంటే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని అన్నారు.
minister botsa