ఐదు గ్రామాల్లోని ప్రజల కోసం ఐదు మెడికల్ టీమ్లు ఏర్పాటు చేశామని మంత్రి బొత్స అన్నారు. బాధిత గ్రామాల్లో 90 శాతం ప్రజలు గ్రామాలకు చేరుకున్నారని తెలిపారు. బాధిత గ్రామాలలో ప్రతి వ్యక్తికి పది వేల రూపాయల నష్టపరిహారం ఇస్తున్నామని గుర్తు చేశారు. మరికొన్ని గ్రామాలను బాధిత గ్రామాల్లో చేర్చాలని అడుగుతున్నారని.. వాటిని పరిశీలించనున్నట్లు బొత్స వెల్లడించారు. గ్రామాల్లో ప్రజలు యథావిధిగా పనులు చేసుకోవచ్చని.. ప్రజలు అభద్రతకు గురికావద్దని.. బొత్స అన్నారు.
ఐదు గ్రామాల్లో ఐదు మెడికల్ టీమ్లు ఏర్పాటు: బొత్స - గ్యాస్ లీకేజ్ గ్రామాల్లో మంత్రుల బస
పరిశ్రమలో ఉన్న రసాయనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని... మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్యాస్ లీకేజ్ పరిసర గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటీ సర్వే చేస్తున్నారన్నారు.
minister bosta about gas leakage effected villages