'వారిది' స్వార్థం! - amanchi krishna mohan
ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్టీ మారడంపై మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. మంత్రి పదవి కోసం ఆశపడి పార్టీ మారిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.
మాట్లాడుతున్న మంత్రి అయ్యన్నపాత్రుడు
రాజకీయాల్లో విలువలు కరువయ్యాయని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు పార్టీ మారడంపై విశాఖ జిల్లా నర్సీపట్నంలోస్పందించారు. మంత్రి పదవి కోసం ఆశపడి పార్టీ మారిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే అవంతి, ఆమంచి వైకాపాలోకి వెళ్లారని ఆరోపించారు. పార్టీ మారడం వారి ఇష్టమన్న అయ్యన్న... అవకాశమిచ్చిన వారిపై విమర్శలు చేయడం సరికాదన్నారు.