'కేంద్రానిది కపట ప్రేమ' - vizag
రాష్ట్రంపై కేంద్రం కపట ప్రేమ చూపిస్తోందని మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైల్వేజోన్‌ను హడావిడిగా ప్రకటించారని ఆరోపించారు.
అయ్యన్న పాత్రుడు
కేంద్రం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటించిందని మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ జిల్లా నర్సీపట్నంలో విమర్శించారు. జోన్ ప్రకటనపై స్పష్టత లేదన్నారు. రాష్ట్రానిపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీపై నిజమైన ప్రేమే ఉంటే హుదూద్ తుపాను వచ్చి ఏళ్లు గడిచిపోతున్నా... ఇప్పటివరకు సాయం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇచ్చిన డబ్బు కూడా వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు.