వైకాపాతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి అవంతి - పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అవంతి శ్రీకారం
వైకాపాతోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
విశాఖ జిల్లా భీమునిపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు. భీమిలి జోన్ పరిధి కొండపేట, పెరికివీధి, వెలంపేట, హరిజన సంతపేట, శ్రీ నగర్, బాలాజీ నగర్లలో నిర్మించనున్న సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు కోటి 8 లక్షల వ్యయంతో రహదారులు, కాలువలు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. వైకాపాతోనే అభివృద్ధి సాధ్యమని ముత్తంశెట్టి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి, పేదల భూమిని ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.