విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా కానుక కిట్లు అందజేశారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
జిల్లాలో సమారు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందజేస్తామని తెలిపారు. నాడు-నేడు పనులు కరోనా వల్ల సకాలంలో పూర్తికాలేదని మంత్రి అన్నారు. నవంబర్ నెలాఖరుకు జిల్లాలోని 1200 పాఠశాలలో నిర్మాణ పనులు పూర్తిచేస్తామన్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.