ఏపీలో రెండు శిల్పారామాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 13 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. 10కోట్ల రూపాయలతో తిరుపతి శిల్పారామం అభివృద్ధి పనులు జరుగుతాయని... శ్రీకాకుళంలో కొత్తగా శిల్పారామం ఏర్పాటుకు తొలి విడతగా 3కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు.
శిల్పారామాల్లో పర్యటకులకు అనుమతి: అవంతి
విశాఖపట్నంలోని శిల్పారామాన్ని రూ.10.92 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపినట్లు పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. రూ.3 కోట్లతో శ్రీకాకుళంలో కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మిస్తామన్నారు.
కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా శిల్పారామాలు తెరుచుకునేందుకు పర్యటక శాఖ అనుమతులు కల్పిస్తోందని మంత్రి తెలిపారు. తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు జరుగుతాయని ఓ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. శిల్పారామాల్లో ఫిల్మ్స్, ఇతర వినోద క్రీడలకు అనుమతులు లేవని చెప్పారు. విశాఖలోని శిల్పారామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఆ మేరకు రూ. 10.92 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:విద్యార్థుల కళానైపుణ్యంతో.. రహదారులు మాట్లాడుతున్నాయ్!