పర్యాటక నగరం విశాఖ రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్ మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రుషికొండ బీచ్‌కు గత నెలలో ఈ గుర్తింపు దక్కింది. మంత్రి అవంతి శ్రీనివాసరావు బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరించారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌గా రుషికొండ ఇక నుంచి విదేశీ పర్యాటకానికి ఎంతగానో చేరువ కానుంది. బ్లూ ఫ్లాగ్ బీచ్ రుషికొండకు సరికొత్త వన్నె తెచ్చిన తీరును మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.
రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ జెండా ఆవిష్కరించిన మంత్రి అవంతి - Minister Avanti Srinivas unveils the Blue Flag news
విశాఖ జిల్లా రుషికొండ బీచ్‌లో బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణ జరిగింది. మంత్రి అవంతి శ్రీనివాస్ బ్లూ ఫ్లాగ్‌ను ఎగురవేశారు. ఇకపై రుషికొండ బీచ్పర్యావరణ హిత అంశాలతో పర్యాటకులను కట్టిపడేయనుంది.
బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు