ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రుల్లో పడకలున్నాయ్.. ఆందోళన వద్దు: మంత్రి ముత్తంశెట్టి - భీమిలి ప్రభుత్వ ఆసుపత్రి

ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, అంబులెన్స్​లను అందుబాటులో ఉంచడంలో.. ఎటువంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వైద్యులను హెచ్చరించారు. విశాఖ జిల్లా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పడకలు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయని, రోగుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

minister avanti inspected bhimili hospital
మంత్రి అవంతి శ్రీనివాస్ ఆస్పత్రి తనిఖీ

By

Published : May 19, 2021, 6:06 AM IST

విశాఖ జిల్లా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్యులు అందరూ సమయం ప్రకారం విధులు నిర్వహిస్తున్నారో లేదో పరిశీలించారు. కరోనా కష్టకాలంలో బాధితులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, అంబులెన్స్ విషయాల్లో ఎటువంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొవిడ్ రోగులకు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:'కేసులు తగ్గినా.. మిగతా 98 శాతం మందికీ ముప్పే!'

భీమిలి ఐఎన్ఎస్ కళింగలో 60, ప్రభుత్వ ఆసుపత్రిలో 10, పద్మనాభం మండలంలో మరో 50 పడకలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. కరోనా బాధితులు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రజలందరూ కొవడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రెమ్‌డెసివిర్‌ ఔషధాలకు కొరత లేదు: సింఘాల్‌

ABOUT THE AUTHOR

...view details