ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటాపురంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం - వెంకటాపురంలో ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ

విశాఖ జిల్లా పద్మనాభం మండలం వెంకటాపురంలో.. కరోనా వ్యాక్సినేషన్​ను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మండల స్థాయి అధికారుల సమీక్షలో.. స్థలాలు మంజూరు కాని పేదవారిని గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

minister avanti started corona vaccination in venkatapuram
వెంకటాపురంలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రారంభించిన మంత్రి అవంతి

By

Published : Jan 20, 2021, 5:37 PM IST

కరోనా టీకా వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు రావని మంత్రి అవంతి శ్రీనివాస్​ అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం వెంకటాపురంలో కరోనా వ్యాక్సినేషన్​ను ఆయన ప్రారంభించారు. రేవిడి పీహెచ్​సీని మరింత అభివృద్ధి చేయడానికి.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. నాడు - నేడులో భాగంగా ఉన్న పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

ప్రతి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని.. మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఆదేశించారు. స్థలాలు మంజూరు కాని నిరుపేదలకు పట్టాలు ఇవ్వడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి కే.రాజేశ్వరి, రేవిడి పీహెచ్​సీ అధికారిణి సమత, ఎంపీడీవో చిట్టి రాజు, తహసీల్దారు శ్రీనివాసరావుతో పాటు స్థానిక వైకాపా నేతలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details