విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో సుమారు రూ.కోటి 20 లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. రెడ్డిపల్లిలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించిన పశువైద్యశాలను మంత్రి ప్రారంభించారు. తునివలసలో రైతుభరోసా కేంద్రం, సీసీ రహదారులతో పాటు చిన్నాపురంలో బస్ షెల్టర్ తదితర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 31 పథకాలలో ప్రతిఒక్కరు ఏదో ఒక పథకంలో లబ్ధిదారులై ఉన్నారని మంత్రి అవంతి అన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్నారు.
విశాఖలో అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన - విశాఖలో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
విశాఖ జిల్లాలో సుమారు రూ.కోటి 20 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు.
విశాఖలో అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శంకుస్థాపన