అర్హులైన లభ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు అందజేస్తామని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం టి.నగరపాలెం, దాకమర్రి, మూలకుద్దు పంచాయితీ పరిధిలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. తమకు ఇళ్లస్థలాలు రాలేదని కొందరు మంత్రిని నిలదీశారు. అనర్హులకు స్థలాలు కేటాయించారని వాపోయారు. వారిని సర్దిచెప్పే ప్రయత్నం చేసిన మంత్రి అవంతి..అర్హులై ఉండి ఇళ్ల స్థలాలు రానివారికి 90 రోజుల్లో పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
అనర్హులకు ఇళ్ల స్థలాలు.. మంత్రి అవంతిని నిలదీసిన అర్హులు - మంత్రి అవంతి న్యూస్
విశాఖ జిల్లా భీమునిపట్నం మండల పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసేందుకు మంత్రి అవంతి రాగా..పలువురు గ్రామస్థులు పట్టాల కోసం నిలదీశారు. అనర్హులకు స్థలాలు కేటాయించారని వాపోయారు. అర్హులై ఉండి ఇళ్ల స్థలాలు రానివారికి 90 రోజుల్లో పట్టాలు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి అవంతిని నిలదీసిన అర్హులు