పంట వేసినప్పటినుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు అనేక దశలలో సకాలంలో రైతుల అవసరాలు తీర్చడమే ప్రభత్వ లక్ష్యమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం కణమాంలో రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించనున్న రైతుభరోసా కేంద్ర భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రిని ఊరి పొలిమేర నుంచే ఎడ్లబండిపై ఊరేగింపుగా సభాస్థలికి రైతులు,నాయకులు తీసుకెళ్లారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు శ్రేయస్సే ప్రధాన ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణు గోపాల రెడ్డి, స్ధానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.