ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాస్టర్లను ఆదుకుంటాం: మంత్రి ముత్తంశెట్టి - మంత్రి ముత్తంశెట్టి తాజా వార్తలు

పాస్టర్లను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. మైనార్టీ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ హైటీ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మైనార్టీల కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

minister avanti in christmas
minister avanti in christmas

By

Published : Dec 23, 2020, 7:49 AM IST

విశాఖ సిరిపురం బాలల ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం మైనార్టీ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ హైటీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు కేక్‌ కట్‌చేశారు. మైనార్టీల కోసం ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో యేసుపాదం ప్రార్థనలు నిర్వహించారు. అనిల్‌ పాల్‌ బైబిల్‌ చదివారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, జాయింట్‌ కలెక్టర్లు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పి.అరుణ్‌బాబు, వి.ఎం.ఆర్‌.డి.ఎ అదనపు కమిషనర్‌ మనజీర్‌ జిలానీ, మైనార్టీ అధ్యక్షుడు ఫారూఖ్‌, మాజీ శాసనసభ్యులు రెహమాన్‌, పలువురు మైనార్టీ నాయకులకు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details