ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అవంతి

వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ ఉత్పాదకాల పరీక్ష కేంద్రం భవన నిర్మాణానికి... విశాఖ జిల్లా భీమునిపట్నం మార్కెట్ యార్డులో మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు. రైతులకు ఉపయోగపడేలా 55 లక్షల వ్యయంతో భవన నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తెలిపారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

By

Published : Jul 11, 2020, 6:35 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో వైఎస్సార్ సమగ్ర వ్యవసాయ ఉత్పాదకాల పరీక్ష కేంద్రం భవన నిర్మాణానికి మంత్రి అవంతి శంకుస్థాపన చేశారు. మట్టి, విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల నాణ్యతా పరీక్షలు ఈ కేంద్రంలో నిర్వహిస్తారని మంత్రి తెలిపారు.

భీమిలి నియోజకవర్గం పరిధిలో భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులకు అందుబాటులో పరీక్ష కేంద్రం నిర్మిస్తున్నామన్నారు. 55 లక్షల వ్యయంతో భవననిర్మాణం చేపడుతున్నామన్నారు. త్వరితగతిన నాణ్యతా పరీక్షలు నిర్వహించి రైతుల పంటల దిగుబడిని పెంపొందించిచాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని అవంతి వ్యాఖ్యనించారు.

ABOUT THE AUTHOR

...view details