ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజా ఆరోగ్యంపై మంత్రి అవంతి సమీక్ష - avanthi srinivas health review

ప్రజారోగ్యంపై విశాఖ జిల్లా పరిషత్​ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, జీవీఎంసీ అధికారులతో మంత్రి అవంతి సమీక్షించారు. సీజనల్ జ్వరాల వ్యాప్తిని నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

ప్రజారోగ్యంపై మంత్రి అవంతి సమీక్ష

By

Published : Nov 5, 2019, 12:13 PM IST

జ్వరాల వ్యాప్తి నియంత్రణపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశం

సీజనల్ జ్వరాల వ్యాప్తిని నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖ జిల్లా అధికారులకు మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖ, జీవీఎంసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. డెంగీ, మలేరియా నియంత్రణ దిశగా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే జ్వరాలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగుపరిచే దిశగా చేపట్టిన చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. విశాఖ మన్యంలో ఈ నెలలో పర్యటిస్తానని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details