ఈ రోజు కార్మిక సంఘాలు, యాజమాన్యాలతో జరిపిన చర్చలు ఫలించాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 694 మంది క్యాజువల్ కార్మికులకు రూ.25 వేలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కార్మికులకు పూర్తి న్యాయం చేసేందుకు కృషి చేశామని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల 6,500 మంది కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాసరావు చొరవతో జూట్ మిల్ సమస్య కొలిక్కి వచ్చిందని చెప్పారు. కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయని, కరోనా కారణంగా చర్చలు కొనసాగలేదని, ఈలోగా ఆర్థిక సంవత్సరం ముగిసిందని వివరించారు. కార్మికులకు పరిహారం సజావుగా జరిగేందుకు చెల్లింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని కలెక్టర్ వెల్లడించారు.