రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ పోతనమల్లయ్యపాలెం సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ప్రభ క్రికెట్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... మధురవాడ అభివృద్ధి చెందుతుందని..అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పక్కనే అకాడమీ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు. ఇలాంటి అకాడమీలు మరిన్ని అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. తొందర్లోనే కొమ్మాది ఇండోర్ స్టేడియం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.
క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా చర్యలు: మంత్రి అవంతి - Minister avanthi srinivas on sports
క్రీడాకారులను ప్రోత్సహించి...మంచి ఆటగాళ్లను తయారుచేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అవంతి అన్నారు.
![క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా చర్యలు: మంత్రి అవంతి Minister avanthi srinivas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8775351-163-8775351-1599905599537.jpg)
Minister avanthi srinivas