విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం పరిధిలో ఉన్న పంచాయతీలలో.. మంత్రి అవంతి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అన్నవరం, అమనాం పంచాయతీలలో అర్హతలున్నా.. తమకు ఇళ్లస్ధలాలు మంజూరు కాలేదని పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
లబ్ధిదారులకు అన్యాయం జరిగింది
క్షేత్రస్థాయిలో నాయకులు ప్రభుత్వ నిబంధనలకు వ్యవహరిస్తున్నారన్నారు. అర్హులైన లభ్ధిదారులలో.. ఎక్కువ మంది అనర్హులకు ప్రభుత్వ నిబంధనలను లెక్క చేయకుండా స్ధలాలివ్వడంతో స్థానికులు మండిపడ్డారు. మంత్రికి తెలియకుండానే కొంతమంది నాయకులు.. ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారికి.. వాటిని అందకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. చేదోడు, చేయూత, ఇళ్లస్ధలాలలో అర్హులకు అన్యాయం జరిగిందని మంత్రి అవంతికి తెలిపారు.