ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జనసేనకు క్యాడర్​ లేరు... తెదేపాకు లీడర్​ లేరు' - విశాఖ జిల్లాలో పవన్​పై మంత్రి అవంతి శ్రీనివాస్​ విమర్శ

పవన్​, తెదేపాలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు తన మాటల తూటాలు వదిలారు. విశాఖలో చేసిన లాంగ్​మార్చ్​ను విమర్శించారు. అలాగే పవన్​ను తెదేపా అధ్యక్షుడిగా  నియమిస్తే బాగుంటుందంటూ పేర్కొన్నారు.

'జనసేనకు క్యాడర్​ లేరు... తెదేపాకు లీడర్​ లేరు'

By

Published : Nov 4, 2019, 6:35 AM IST

జనసేన, తెదేపాలపై రాష్ట్ర మంత్రి ముత్తెంశెట్టి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. విశాఖలో పవన్​ చేసిన లాంగ్​మార్చ్​ను రాంగ్​ మార్చ్​ అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆ సభకు...33 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొనడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. జనసేన పార్టీకి క్యాడర్​ లేదని... తెదేపాకు లీడర్​ లేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వయసు మీద పడినందున తెదేపా బాధ్యతను పవన్​ కల్యాణ్​కు అప్పగిస్తే బాగుంటుందంటూ పేర్కొన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన తెరచాటు రాజకీయాలు చేశారని... ఇప్పుడు ఆ పరిస్థితి బట్టబయలు అయ్యిందన్నారు. గత ప్రభుత్వం జరిగిన అవినీతి, అక్రమాలు పవన్​ కల్యాణ్​కు కనిపించలేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేదని... నదుల్లో నీరు ప్రవహించటం వలనే సమస్య వచ్చిందన్నారు.

'జనసేనకు క్యాడర్​ లేరు... తెదేపాకు లీడర్​ లేరు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details