వాలంటీర్లపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారని స్పష్టం చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన 'వాలంటీర్లకు సేవా పురస్కారాలు' పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పరిపాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మరింత పటిష్టం కావాలని పిలుపునిచ్చారు.
'వాలంటీర్లపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు' - వాలంటీర్ సేవా పురస్కారాలు అప్డేట్స్
విశాఖ జిల్లా నర్సీపట్నంలో జరిగిన 'వాలంటీర్లకు సేవా పురస్కారాలు' పంపిణీ కార్యక్రమంలో మంత్రి అవంతి పాల్గొన్నారు. వాలంటీర్లపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
minister avanthi srinivas