విశాఖ సింహాచలం అప్పన్న గోశాలను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు సందర్శించారు. భక్తులు సమర్పించే లేగదూడలు అనారోగ్యంతో ఉంటే అవి చనిపోయే అవకాశం ఉందని.. అటువంటి ఆవులను స్వీకరించ వద్దని దేవస్థానానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తులు ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే స్వామికి సమర్పించాలని కోరారు.
అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దు: మంత్రి అవంతి - విశాఖ సింహాచలం ఆలయంలో మంత్రి అవంతి పర్యటన అవంతి
మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ సింహాద్రి అప్పన్న గోశాలను పరిశీలించారు. భక్తులు కేవలం ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే స్వామికి సమర్పించాలని కోరారు. అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దని దేవస్థానానికి సూచించారు.
minister avanthi
గోశాలలో పనిచేసే గోసంరక్షకులు 31 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాలను పాటించాలని మంత్రి తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అనవసరమైన వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. దేవునిపై రాజకీయంగా.. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు.
ఇదీ చదవండి:మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
TAGGED:
సింహాచలంలో మంత్రి పర్యటన