మద్యం దుకాణాల వద్ద పరిస్థితి రెండు రోజుల్లో సర్ధుకుంటుందని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విషయంపై ఆందోళన చెందాల్సిందేమీ లేదన్నారు. మందు బాబులు ఆత్రుత కొద్దీ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని తెలిపారు. మద్యం కొనుగోలుదారులు సంయమనం పాటించాలని సూచించారు. విశాఖ వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో కలెక్టర్ వినయ్ చంద్, సీపీ ఆర్కే మీనాతో కలిసి మంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. లాక్ డౌన్ కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే వర్తిస్తుందని సీపీ తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో నిర్దేశించిన సమయంలో ప్రజలు బయటకు రావచ్చని స్పష్టం చేశారు.
'మాకు ఇష్టం లేదు... కేంద్రం చెప్పిందనే మందుషాపులు తెరిచాం'
రాష్ట్రంలో చాలా చోట్ల మద్యం దుకాణాల వద్ద రద్దీ కనిపిస్తోంది. మందు బాబులు భౌతిక దూరం కూడా పాటించటం లేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మంత్రి అవంతి స్పందించారు. మందు బాబుల ఆత్రుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు.
minister avanthi srinivas comments on liquor sales