విశాఖ పరిపాలన రాజధానిపై రెఫరెండంకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖలో గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్ధపడాలని మంత్రి సవాల్ విసిరారు. సబ్బం హరి ముఖ్యమంత్రి జగన్ గురించి చేసిన వ్యాఖ్యలపై అవంతి మండిపడ్డారు. అమరావతిలో కనీస రవాణా సదుపాయాలు లేవంటూ విమర్శలు చేసిన మంత్రి... తాము అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు.
పరిపాలన రాజధానిపై రెఫరెండంకు సిద్ధం: అవంతి - minister avanthi comments on referundum issue on executive capital news
తెదేపా హయాంలో ఏర్పాటు చేసిన రాజధాని అమరావతిలో కనీస రవాణా సదుపాయాలు లేవని మంత్రి అవంతి శ్రీనివాస్ విమర్శించారు. విశాఖ పరిపాలన రాజధానిపై రెఫరెండంకు సిద్ధమని.. ఇక్కడ గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు.
పరిపాలన రాజధానిపై రెఫరెండంకు సిద్ధం: అవంతి