ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది:అవంతి - ఏపీ అమరావతి రాజధాని వార్తలు

అమరావతి ప్రాంత రైతులకు తమ ప్రభుత్వం అన్యాయం చేయబోదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. అమరావతిలో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉత్తరాంధ్రలో ఉద్యమం చేస్తామని తెలిపారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితమైతే ఇతర ప్రాంతాల పరిస్థితేంటని ప్రశ్నించారు.

avanthi
అవంతి

By

Published : Jan 9, 2020, 11:35 PM IST

మీడియా సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్

అమరావతిని మార్చకుంటే విప్లవం వస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రం అంటే 29 గ్రామాలు అన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జాతీయ నాయకుడి స్థాయి నుంచి ఓ జాతికి నాయకుడిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి మొత్తం ఒకే రాజధానికి పరిమితమైతే మిగతా ప్రాంతాల సంగతేంటని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీయ ప్రజలు చంద్రబాబుకి ఓట్లు వేయలేదా అన్ని ప్రశ్నించారు. ధర్నాలు, రాస్తారోకోలు తమకు వచ్చన్న మంత్రి.... ప్రభుత్వంలో ఉన్నందున ఓర్పుతో ఉన్నామని తెలిపారు. తమ మంచితనాన్ని అసమర్థతగా తీసుకోవద్దని అన్నారు. ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా తమ ప్రభుత్వం వ్యవహరించబోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రమంటే కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమేనా అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంత రైతులకు ప్రభుత్వం అన్యాయం చేయదని పునరుద్ఘాటించారు. పవన్ కల్యాణ్​ను చంద్రబాబు దత్తపుత్రుడని మంత్రి విమర్శించారు. 'అమరావతిని మారిస్తే విప్లవం వస్తుంది అని ఆయన అంటాడు. ఇప్పుడు మేము చెబుతున్నాం. అమరావతిని మార్చకపోతే విప్లవం వస్తుంది' అని మంత్రి హెచ్చరించారు. ఈ రాష్ట్రం మూడు ముక్కలైతే సంతోషంగా ఉంటుందా అని విపక్షాలను ప్రశ్నించారు. పరిపాలన రాజధాని కోసం విశాఖకు చెందిన తెదేపా ఎమ్మెల్యేలు అనుకూల తీర్మానం చేశారని గుర్తు చేశారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని మంత్రి అవంతి సవాల్ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details