పర్యటక, క్రీడల శాఖకు సంబంధించి కొవిడ్‌తో 8 మంది మృతి చెందారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లు దాటిన ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల బదిలీకి ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ ఉద్యోగులకు.. కలెక్టర్లు ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారని.. పర్యాటక ప్రోత్సాహక విధుల కోసమే వారిని వినియోగించాలని ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు నిధులతో పర్యాటక రంగంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సీ ప్లేన్‌లను ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తోందన్నారు. కరోనా నిబంధనలతో ఈనెల 27న పర్యాటక దినోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.