ఆదివారం నుంచి 29వ తేదీ వరకు నాలుగు బృందాలు విశాఖ ఫార్మా సిటీలో పారిశ్రామిక భద్రతా తనిఖీలు చేపడతాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. వారు ఇచ్చిన నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. పారిశ్రామిక ప్రమాదాలపై అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాదాలకు మానవ వైఫల్యం కారణమా.. లేక వ్యవస్థ కారణమా తెలుసుకోవాలన్నారు.
ఫార్మా సిటీలో భద్రతా తనిఖీలకు ప్రత్యేక బృందాలు: మంత్రి ముత్తంశెట్టి - విశాఖలో అవంతి శ్రీనివాస్ వార్తలు
విశాఖ ఫార్మా సిటీలో ప్రత్యేక బృందాలు భద్రతా తనిఖీలు చేపడతాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు నాలుగు బృందాలు పని చేస్తాయని వెల్లడించారు. వరుస ప్రమాదాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
వరుస ప్రమాదాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. ఫైర్, పరిశ్రమలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖలతో ఈ తనిఖీ బృందాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఎక్కడ లోపాలు ఉన్నా.. సరి చేయాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ప్రజలు భద్రతపై ప్రధానంగా పని చేస్తున్నామని వివరించారు. రూ.2.5 కోట్లు పరవాడ ఫార్మా వారు వసూలు చేశారని.. అక్కడ 20 వేల మంది పని చేస్తున్నారన్న మంత్రి.. త్వరలో అక్కడ ఆసుపత్రి నిర్మిస్తామన్నారు.