Amar Raja group investments in Telangana: విశాఖలోని సర్క్యూట్ హౌస్లో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పెట్టుబడి పెడతామంటే, ఏపీ నుండి వెళ్లగొట్టిందంటూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమర రాజా గ్రూపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ఎంపీది.. కాబట్టి ఈ ప్రచారం చేస్తున్నారని అన్నారు. అమర రాజా గ్రూప్ ఏపీలో పెట్టాల్సిన, పెట్టుబడులు తెలంగాణలో పెట్టామని ఎవరైనా చెప్పారా అని ప్రశ్నించారు. ఏపీలో కాకుండా.. ఇంకెక్కడ పెట్టుబడులు పెట్టకూడదని ఉందా అంటూ వ్యాఖ్యానించారు.
ప్రతిపక్ష పార్టీల పరిశ్రమలు ఉండకూడదనుకుంటే హెరిటేజ్ ఏపీలో ఎలా నడుస్తుందని అమర్నాథ్ ప్రశ్నించారు. పరిశ్రమల ఏర్పాటు ఎప్పుడు రాజకీయ కోణంలో చూడలేదని.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక్కడ పెట్టుబడులు పెట్టకూడదని విధంగా విమర్శిస్తున్నారని తెలిపారు.అమరరాజా సంస్థ..కాలుష్య నిబంధనలను సరిగా పాటించలేదన్నారు. తెలంగాణలో పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లగొట్టినట్లా అని ఆయన ప్రశ్నించారు.