New Industrial policy In Two Months: రెండు నెలల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. సీఎం జగన్ ముందుచూపు, చొరవ కారణంగా పరిశ్రమలు తరలివస్తున్నాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయన్నారు. మూడున్నరేళ్లలో 73వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 21 మెగా పరిశ్రమలు రావడంతో 60వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. వివిధ కారిడార్ల అభివృద్ధికి 50వేల నుంచి 60వేల ఎకరాల భూములు సిద్ధంగా ఉన్నాయన్నారు. తిరుపతి, కొప్పర్తిలలో మెగా ఇండస్ట్రియల్ హబ్‌లు రానున్నాయన్నారు. 350 అంశాలకు సంబంధించి సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి అమర్‌నాథ్ వివరించారు.
రెండు నెలల్లో కొత్త పారిశ్రామిక విధానం: మంత్రి అమర్‌నాథ్ - యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి
New Industrial policy In Two Months: రెండు నెలల్లో కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. 350 అంశాలకు సంబంధించి సులభతర వాణిజ్యంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మంత్రి అమర్‌నాథ్ వివరించారు.
Minister Amarnath