ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మా రాష్ట్రంపై విమర్శలు సరికాదు.. 8 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి: మంత్రి గుడివాడ

AMARNATH ON KCR : హరీష్‌రావుకు, కేసీఆర్‌కు గొడవలుంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలే కానీ రాష్ట్రంపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

AMARNATH ON KCR
AMARNATH ON KCR

By

Published : Sep 30, 2022, 5:43 PM IST

MINISTER AMARNATH : కేసీఆర్‌, తెరాసను చూసి నేర్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తమకు లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. మంత్రి హరీశ్‌రావు, సీఎం కేసీఆర్‌కు మధ్య గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూసుకోవాలి కానీ రాష్ట్రంపై విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. తెలంగాణ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి.. తెలంగాణకు ఎనిమిదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. హరీశ్‌రావు జగన్‌ను తిడితే.. మేం ఇక్కడ కేసీఆర్‌ను తిడతాం అది చూసి హరీశ్‌ హ్యాపీ ఫీలవుదామన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు ఎలాంటి సంక్షేమం అందుతుందో, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుందో ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో జరిగిన సంక్షేమం, వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏపీలో జరిగిన సంక్షేమం గురించి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కేటీఆర్‌ ఉదయం విమర్శ చేసి రాత్రికి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఏపీ భవన్‌లో అధికారిని హరీశ్‌రావు ఎలా తన్నారో అందరూ చూశారని మంత్రి అమర్నాథ్‌ అన్నారు.

అసలేం జరిగిందంటే : ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వానికైనా వంద శాతం పనులను పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ఏపీలో ఉపాధ్యాయులపై కేసులు పెట్టి ఎలా లోపల వేస్తున్నారో.. తెరాస ప్రభుత్వం ఎంత ఫ్రెండ్లీగా ఉందో గమనించాలని సూచించారు. దేశంలోనే 73 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన ఘనత తెలంగాణదని కొనియాడారు.

8 ఏళ్లుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details