ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అత్యవసర సేవలందిస్తున్న అందరికీ పరీక్షలు' - విశాఖ జిల్లాలో కరోనా కేసులు

విశాఖ జిల్లాలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. వీరితో పాటు మీడియా ప్రతినిధులకు పరీక్షలు చేస్తామన్నారు.

minister avanthi srinivas news
minister avanthi srinivas news

By

Published : Apr 27, 2020, 5:28 PM IST

విశాఖలో మే 3 వరకు కంటైన్మెంట్‌ జోన్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉంటాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పండించిన పంటల కొనుగోలుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 11,330 మందికి కొవిడ్‌ పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారిలో 22 మందికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయన్నారు. విశాఖకు కొద్దిరోజుల్లో 16 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు వస్తాయని పేర్కొన్నారు. అత్యవసర సేవల్లో పాల్గొంటున్న పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details