ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లంబసింగి @ 6 డిగ్రీలు.. మరో వారం ఇదే తీరు! - విశాఖపట్నం వార్తలు

గత రెండు రోజులుగా విశాఖలోని పాడేరు ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో ఉష్ణోగ్రత 6 డిగ్రీలకు పడిపోయింది. స్థానికులు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వారం పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Minimum temperatures recorded at Paderu Agency in Visakhapatnam
విశాఖలోని పాడేరు ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

By

Published : Dec 22, 2020, 10:56 AM IST

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో గత 2 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో 6, మినుములూరులో 7, చింతపల్లిలో 8, పాడేరులో 8 డిగ్రీలు నమోదయ్యాయి. నరాలు కొరికే చలితో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు.

చలి మంటలు వేసుకుంటే గాని ఉపశమనం లభించడం లేదు. ఈ పరిస్థితితో విద్యార్థులు, ఉద్యోగస్థులు, కూలి పనివారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరో వారం రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ABOUT THE AUTHOR

...view details