ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనీస సౌకర్యాలు లేక పాయకరావుపేట బస్టాండ్​లో అవస్థలు - పాయకరావుపేట బస్టాపు వార్తలు

విశాఖ జిల్లా పాయకరావుపేట బస్టాండ్​లో కనీస సౌకర్యాలు లేవని ప్రయాణికులు వాపోతున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Minimum facilities are not There in Payakaraopeta Bus stop in visakhapatnam district
Minimum facilities are not There in Payakaraopeta Bus stop in visakhapatnam district

By

Published : Jun 3, 2020, 1:38 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్​లో బస్సు ఎక్కాలంటే ఊపిరి బిగపట్టాల్సిందేనని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు నిత్యం అధిక సంఖ్యలో... ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

బస్టాండులో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:విశాఖ వైద్యుడు సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details