MILAN-2022: విశాఖలో తలపెట్టిన మిలన్-2022 ఫుల్ డ్రస్‌డ్ రిహార్సల్స్‌ను కేంద్రమంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడ్మిరల్ హరికుమార్, వివిధ దేశాల నేవీ ఉన్నతాధికారులు, 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది హాజరయ్యారు.
దేశీయ ఉత్పత్తులతో "మిలన్-2022 విలేజ్"
మిలన్-2022 విలేజ్‌ను సైతం ప్రారంభించిన కేంద్రమంత్రి.. దేశీయ ఉత్పత్తులతో ఏర్పాటైన 40 స్టాళ్లను పరిశీలించారు. మిలన్ సందర్భంగా ఆర్‌కే బీచ్‌లో త్రివిధ దళాలు విన్యాసాలు చేపట్టాయి.