ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వలస కార్మికుల ఆందోళన... పోలీసుల మోహరింపు - lock down seens

విశాఖ జిల్లా పాయకరావుపేటలోని డెక్కన్ పరిశ్రమలో పని చేస్తున్న వలస కార్మికులు తమ ప్రాంతాలకి పంపించాలంటూ ఒక్కసారిగా బయలుదేరారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని ఆపి నచ్చచెప్పారు. అప్పటి వరకు అధికారులు స్థానిక౦గా ఏర్పాటు చేసిన వసతి కేంద్రాల్లో ఉ౦డాలని సూచించారు.

vishaka district
వలస కార్మికుల ఆందోళన..

By

Published : May 5, 2020, 5:22 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦లోని డెక్కన్ పరిశ్రమలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు.. తమ ప్రాంతాలకు పంపి౦చాలంటూ ఒకేసారి భారీ ఎత్తున బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. సత్యవరం సమీపంలో ఉన్న కొబ్బరి తోటకు తరలించారు. కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది.

నర్సీపట్నం ఏఎస్పీ రిషాంత్ రెడ్డి, తహసీల్దార్ కార్మికులకు నచ్చ చెప్పారు. పరిశ్రమలో పనులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళేందుకు అనుమతులు లేవని వివరించారు. అప్పటి వరకు అధికారులు స్థానిక౦గా ఏర్పాటు చేసిన వసతి కేంద్రాల్లో ఉ౦డాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details