చెన్నై నుంచి వచ్చిన వలస కూలీలను విశాఖపట్నం జిల్లా అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. చీడికాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 31 మంది కూలీలు చెన్నై నుంచి వచ్చారు. వీరందరినీ చీడికాడ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించామని ఉప తహసీల్దార్ శ్రీరామ్మూర్తి చెప్పారు.
చీడికాడ క్వారంటైన్ కేంద్రానికి వలస కూలీలు - cheedikada latest news
లాక్డౌన్ ప్రభావంతో ఉపాధి పనులు నిలిచిపోయాయి. ఫలితంగా ఇతర రాష్ట్రాలలో ఉన్న వలస కూలీలు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా సొంత ఊరిని చేరుకోవాలన్న ఆలోచనతో కాలినడకన స్వగ్రామానికి పయనమవుతున్నారు. ఈ విధంగా చెన్నై నుంచి విశాఖపట్నం వచ్చిన వలస కూలీలను అధికారులు అడ్డుకుని స్థానిక చీడికాడ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
చీడికాడ క్వారంటైన్ కేంద్రానికి వలస కూలీలు