కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన మధ్యాహ్న భోజన తయారీ దారులకు ప్రత్యేక జీవన ఉపాధి కల్పించాలని కోరుతూ విశాఖ జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నెలకు 7వేల 500 రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేెశారు. వంట కార్మికులను కార్మికులుగా క్రమబద్ధీకరించాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని ఆందోళన చేపట్టారు.
మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులు ధర్నా - మధ్యాహ్న భోజనం తయారీదారులు ఆందోళన తాజా వార్తలు
విశాఖ జిల్లా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 7వేల 500 వేతనాన్ని చెల్లించాలంటూ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళన