ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంధురాలైన భార్యకు చెప్పలేక కుటుంబీకుల మనోవేదన.. - accident news at malkapuram

విశాఖ జిల్లా మల్కాపురంలో ఓ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. పెళ్లయిన రెండేళ్లకే భార్యకు అనారోగ్యం.. రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. ముగ్గురు బిడ్డలు.. ఒక పక్క కుటుంబాన్ని పోషిస్తూ.. మరో పక్క భార్యను కంటి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు ఆ భర్త .. ఇంతలో విధి పగబట్టినట్లు.. ఆ భర్తను ఓ లారీ రాక్షసంగా బలి తీసుకుంది. ఈ విషయం భార్యకు తెలియనీయలేదు కుటుంబ సభ్యులు.. తెలిస్తే ఆమె తట్టుకోలేదని, ఏడిస్తే ఎక్కడ విషయం తెలుస్తుందోనని, లోలోన గుండెలు పగిలిపోయేలా దుఃఖిస్తున్నారు. వారు పడుతున్న బాధను చూసి చుట్టుపక్కల వారు చలించిపోతున్నారు.

mental anguish of the family not being able to tell the blind wife at visakhapatnam
అంధురాలైన భార్యకు చెప్పలేక కుటుంబీకుల మనో యాతన

By

Published : Dec 13, 2020, 4:41 PM IST

పెళ్లయిన రెండేళ్లకే భార్యకు అనారోగ్యం.. రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. ముగ్గురు బిడ్డలు.. ఒక పక్క కుటుంబాన్ని పోషిస్తూ.. మరో పక్క భార్యను కంటి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు ఆ భర్త .. ఇంతలో విధి పగబట్టినట్లు.. ఆ భర్తను ఓ లారీ రాక్షసంగా బలి తీసుకుంది. ఈ విషయం భార్యకు తెలియనీయలేదు కుటుంబ సభ్యులు.. తెలిస్తే ఆమె తట్టుకోలేదని, ఏడిస్తే ఎక్కడ విషయం తెలుస్తుందోనని, లోలోన గుండెలు పగిలిపోయేలా దుఃఖిస్తున్నారు. వారు పడుతున్న బాధను చూసి చుట్టుపక్కల వారు చలించిపోతున్నారు. హృదయ విదారకరమైన ఈ ఘటనకు సంబంధించి హార్బర్‌ స్టేషన్‌ పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మల్కాపురంలో నివాసం ఉంటున్న స్నేహితులు చింతాడ ఆనందరావు, రవీంద్ర వర్మ శనివారం ఉదయం 9 గంటలకు ద్విచక్రవాహనంపై జగదాంబకూడలి వద్ద గల చర్చిలో ప్రార్థనలకు వచ్చారు. ప్రార్థనలు ముగించుకుని మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కాన్వెంట్‌ పై వంతెన మీదుగా తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. వెనుక కూర్చున్న రవీంద్రవర్మ కాస్త దూరంలో తుళ్లి పడిపోయారు. ఆనందరావుపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోయాయి. దీంతో అతని శరీరమంతా గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జయిపోయింది. లారీ డ్రైవర్‌, క్లీనర్‌ లారీని వదిలి పరారయ్యారు. గాయపడిన రవీంద్రవర్మను స్థానికులు కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు ఆనందరావు మృతదేహన్ని కేజీహెచ్‌ శవాగారానికి తీసుకెళ్లారు.

ఆనందరావుకు భార్య సాయిశ్రీ, కుమార్తెలు దేవి, జగదీశ్వరి, కుమారుడు జయకుమార్‌ ఉన్నారు. వీరికి వివాహాలు జరిగాయి. జయకుమార్‌ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. ఆనందరావు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. కళ్లు కనిపించని తల్లికి తండ్రి మరణం గురించి చెప్పలేక కుమారుడు, కుమార్తెలు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు..దేవుడా మా కెందుకింత శిక్ష వేశావ్‌ అంటూ మౌనంగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:

వాడిన పూలు వికసించెనే.. పడతి ప్రగతికి సహకరించెనే...

ABOUT THE AUTHOR

...view details