ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

విశాఖపట్నంలోని ఎల్​.బి.పట్నానికి చెందిన ఓ యువకుడికి కరోనా వైరస్​ పాజిటివ్​గా నమోదైంది. ఈ నెల 3వ తేదీన వ్యక్తి హైదరాబాద్​ నుంచి రాగా.. రెండు రోజుల తర్వాత వైద్య సిబ్బంది అతడిని చోడవరం తరలించి కోవిడ్ పరీక్షలు చేశారు. పాజిటివ్​ అని ఫలితం వచ్చింది. అధికారులు అతను నివాసం ఉన్న ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశారు.

men tested covid positive at visakha
విశాఖలోని ఎల్​.బి.పట్నంలో వ్యక్తికి కరోనా పాజిటివ్​

By

Published : Jul 7, 2020, 3:36 PM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం ఎల్​.బి.పట్నానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. యువకుడు ఈ నెల 3వతేదీన హైదరాబాద్​ నుంచి విశాఖకు వచ్చాడు.

రెండు రోజుల తర్వాత వైద్య సిబ్బంది చోడవరం తరలించి కొవిడ్​ పరీక్ష చేయించారు. పాజిటివ్​గా రావడంతో అప్రమత్తమైన అధికారులు విశాఖ తరలించరని ఎంపీడీఓ జయప్రకాశరావు చెప్పారు. ఎస్​ఐ.సురేశ్​కుమార్ తో కలిసి ఆయన గ్రామాన్ని​ పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details