ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సరదాగా స్నానానికి దిగిన యువకుడు గల్లంతు

By

Published : Oct 7, 2021, 1:05 AM IST

సరదాాగా సముద్ర ఒడ్డున స్నానానికి దిగిన వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ విషాదం విశాఖ జిల్లాలో జరిగింది. తీర ప్రాంతంలో గస్తీలో ఉన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

men missing at beach in vishakha district
men missing at beach in vishakha district

సరదాగా సముద్రతీరంలో స్నానానికి దిగి అలల ఉద్ధృతికి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మల్కాపురం ప్రకాష్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇబ్రహీం (20)తో పాటు మరో ఆరుగురు స్నేహితులు బుధవారం మధ్యాహ్నం బీచ్ రోడ్డు పాండురంగాపురం తీరానికి చేరుకున్నారు. అందరూ స్నానానికి దిగారు. సయ్యద్ ఇబ్రహిమ్ స్నానం చేస్తుండగా అలల ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో.. పెద్ద కెరటాలు లోనికి నెట్టేశాయి. తీరప్రాంతంలో గస్తీ కాస్తున్న పోలీసులు గమనించి.. కోస్టుగార్డుకు సమాచారం ఇచ్చారు. వారు తక్షణమే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇబ్రహీమ్ తండ్రి అబ్దుల్లా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details