memorial salute to the heroes of the Indian Navy: విశాఖ సాగర తీరంలో విజయ్ దివస్‌ను తూర్పు నౌకాదళం ఘనంగా నిర్వహించింది. భారత్ 1971లో పాకిస్తాన్‌పై యుద్ధంలో సాధించిన విజయాన్ని గుర్తుగా ఈ విజయ్ దివస్ ను జరుపుకోవడం ఆనవాయితీ. నౌకాదళం సాధించిన విజయానికి కారకులై యుద్ధంలో అమరులైన వీరులకు నివాళులర్పించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావెల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీ కుమార్ నాయర్ హాజరై విక్టరీ ఎట్ సి వద్ద పుష్పగుచ్చాలను సమర్పించి మౌనం పాటించారు.
విశాఖలో విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించిన తూర్పు నౌకాదళం - Andhra Pradesh News
memorial salute to the heroes of the Indian Navy: భారత సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడిన రోజు అది. శత్రువుల మీద విజయం సాధించి జాతీయ పతాకాన్ని ఎగరేసిన రోజది అదే 1971 డిసెంబరు 16. ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా డిసెంబరు 16న త్రివిధ దళాలు విజయ్ దివస్ నిర్వహిస్తాయి. ఈ సందర్బంగా విజయ్ దివస్‌ను విశాఖలో.. తూర్పు నౌకాదళం ఘనంగా నిర్వహించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావెల్ ప్రాజెక్ట్ వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్.. విక్టరీ ఎట్ సీ వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి మౌనం పాటించారు.
విశాఖలో విజయ్ దివస్‌ను ఘనంగా నిర్వహించిన తూర్పు నౌకాదళం
భారత్ 1971లో పాకిస్తాన్ పై యుద్ధం లో విజయానికినౌక దళం ప్రధాన భూమిక పోషించింది. దీనికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ రోజున త్రివిధ దళాలు ఆయాచోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తాయి. భారత నౌకాదళ వీరులకు స్మారక వందనాన్ని నౌకాదళ సిబ్బంది సమర్పించారు.విక్టరీ ఎట్ సి స్తూపం వద్ద నిర్వహించినఈ కార్యక్రమాన్ని తూర్పు నౌకాదళం సిబ్బంది హాజరయ్యారు.
ఇవీ చదవండి: