RC15 Movie Shooting in Visakhapatnam: టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'ఆర్సీ 15'. ఇప్పటికే పలు ప్రదేశాల్లో శరవేంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను విశాఖలో జరుగుతోంది. విశాఖలోని గీతం కళాశాలకు వచ్చారు. చుట్టూ డాన్సర్ల మధ్య హెలికాప్టర్ నుంచి రామ్‌చరణ్ దిగుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. షూటింగ్ విషయం తెలుసుకుని అభిమానులు భారీగా తరలి వచ్చారు.
కాగా కొద్ది రోజుల క్రితం ఈ సినిమా చిత్రీకరణ కర్నూలులో జరిగింది. కర్నూల్లోని కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేశారు. ఆ సమయంలో కూడా అభిమానులు భారీగా గుమిగూడారు. అంతకు ముందు హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద షూటింగ్ చేసిన మూవీ టీమ్ ఇప్పుడు విశాఖలో తదుపరి చిత్రీకరణను మొదలుపెట్టింది.